రేపు బెంగుళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం
- February 11, 2022
బెంగుళూరు:టాటా ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది.ఈ మెగా వేలంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టే క్రికెటర్స్ ఎవరో అతి తర్వలోనే తెలియనుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం బెంగళూరులో వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది.అయితే పాత 8 జట్లతో పాటు ఈ సీజన్లో కొత్తగా గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ సూపర్ జెయింట్స్ పోటీ పడనున్నాయి. ఆర్పీ సంజీవ్ గోయింకా గ్రూప్… లక్నో జట్టును 7090 కోట్లకు కొనుగోలు చేయగా… అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ 5625 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 590 మంది ఆటగాళ్లు ఉండగా, 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.
ఐపీఎల్ వేలంలో వాడే రైట్ టు మ్యాచ్ కార్డు మాత్రం ఈ సారి అందుబాటులో ఉండడం లేదు.
రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా వేలంపాటలో వేరే జట్టు దక్కించుకున్న ప్లేయర్ని… అదే రేటుకి పాత ఫ్రాంఛైజీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశం ఉండదు. ఐపీఎల్ 2022 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో 90 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ వాల్యూ 85 కోట్లు ఉండగా… మరో రూ.5 కోట్లు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..