లూలు గ్రూప్ చైర్మన్ కు బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసా

- February 14, 2022 , by Maagulf
లూలు గ్రూప్ చైర్మన్ కు బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసా

బహ్రెయిన్: లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ MA బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసాను పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. గోల్డెన్ రెసిడెన్సీ వీసా ప్రతిభావంతులను ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి బహ్రెయిన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూసఫ్ అలీ స్పందిస్తూ.. ఈ గౌరవాన్ని అందుకోవడం తన జీవితంలో చాలా గర్వంగా ఉందన్నారు. కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, బహ్రెయిన్ ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫా, బహ్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ ఆర్థిక వృద్ధి పట్ల తన నిబద్ధతను బలోపేతం చేయాలని కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలు యూసఫ్ అలీకి పిలుపునిచ్చారు. ఈ గోల్డెన్ రెసిడెన్సీ వీసాతో ఈ ప్రాంతంలోని కీలక పెట్టుబడులు, వ్యాపార కేంద్రాలలో ఒకటిగా బహ్రెయిన్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు. 2014లో హెచ్‌ఎం కింగ్ హమద్ నుండి బహ్రెయిన్ అత్యున్నత గౌరవం 'వెస్సామ్ అల్ బహ్రెయిన్' అందుకున్న మొదటి బహ్రెయిన్యేతర వ్యక్తి కూడా యూసఫాలీయే కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com