అస్సాంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు..!
- February 15, 2022
హైదరాబాద్: సర్జికల్ స్ట్రయిక్స్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై అస్సాం బీజేపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సర్జికల్ స్ట్రయిక్స్‌కు ప్రూఫ్ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అస్సాంలో బీజేపీ నేతలు కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పట్ల అస్సాం సీఎం వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుపట్టారు. అస్సా సీఎంను బీజేపీ ప్రోత్సహిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఆయనపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఆధారాలు బయటపెట్టాలని కేంద్రాన్ని రాహుల్ అడగడంలో తప్పు లేదన్న కేసీఆర్...తాను కూడా ఆధారాలు అడుగుతున్నానన్నారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







