ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ..కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి
- February 15, 2022
అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.ఇంటెలిజెన్స్ డీజీపీ బాధ్యతలు కూడా ప్రస్తుతానికి రాజేంద్రనాథ్ రెడ్డి వద్దే ఉన్నాయి. మరోవైపు, గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది.
గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా పని చేశారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ రాజేంద్రనాథ్ ను డీజీపీగా నియమించడం గమనార్హం. రాజేంద్రనాథ్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం ఇంతవరకు కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







