ఏపీ సీఎం జగన్‌ను క‌లిసిన కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి

- February 16, 2022 , by Maagulf
ఏపీ సీఎం జగన్‌ను క‌లిసిన కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి

అమరావతి: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన ప్ర‌భుత్వం ఆయ‌న స్థానంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ రోజు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జగన్‌ను కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. 1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. కాగా, గౌతమ్‌ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించిన విష‌యం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com