తెరాస NRI కువైట్ టీం ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

- February 16, 2022 , by Maagulf
తెరాస NRI కువైట్ టీం ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

కువైట్ సిటీ: తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు తెరాస ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి KTR పిలుపు మేరకు తెరాస ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో తెరాస కువైట్ సభ్యులందరము దుస్తులు దానం చేయడం,మొక్కలు నాటడంతోపాటు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

ఈ మధ్యలోనే అమలు చేసినటువంటి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా మన వంతుగా పాలుపంచుకొని విజయవంతం చేయాలని అభిలాష కోరారు.

తెలంగాణ సాధించి ఎంతో అభివృద్ధి చేయడంతోపాటు ఎన్నో అద్భుతమైన పధకాలు ప్రవేశపెట్టారు.మన పథకాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకి కూడా ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ రాష్ట్రాలలో కూడా అమలు పరుస్తున్నారు.

కెసిఆర్ నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభిలాష ఆకాంషిస్తున్నాని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెరాస NRI కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గొడిశాల, ముఖ్య సలహాదారులు గంగాధర్ జీకే, వైస్ ప్రెసిడెంట్ రవి గన్నరపు, ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, కమిటీ సభ్యులు అయ్యప్ప, రవి సుధగాని, జగదీశ్ సాయి నాయుడు, మహమ్మద్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com