అల్ ఖువైర్‌లో మొబైల్ మెడికల్ సర్వీస్ క్యాంపెయిన్ ప్రారంభం

- February 17, 2022 , by Maagulf
అల్ ఖువైర్‌లో మొబైల్ మెడికల్ సర్వీస్ క్యాంపెయిన్ ప్రారంభం

ఒమన్: మస్కట్ గవర్నరేట్ కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అల్ ఖువైర్‌లోని హే అల్ వజారత్ (మినిస్ట్రీస్ డిస్ట్రిక్ట్) పబ్లిక్ యార్డ్ లో COVID-19 వ్యాక్సిన్లు వేయడానికి మొబైల్ మెడికల్ సర్వీస్ (బస్ సర్వీస్) క్యాంపెయిన్ ప్రారంభమైంది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు డైరెక్టరేట్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని ప్రారంభించారు. సిటిజన్స్, రెసిడెంట్స్ లకు వ్యాక్సిన్ వేయడం వేగవంత చేయడం ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం. ఈసందర్భంగా ఫ్యామిలీ మెడిసిన్ కన్సల్టెంట్ అండ్ డైరెక్టరేట్‌లోని ఇన్ఫర్మేషన్ కమిటీ ఛైర్‌పర్సన్ డాక్టర్ మనల్ బింట్ సైద్ అల్ ధంకీ మాట్లాడుతూ.. అవసరమైన వారికి ఫస్ట్ అండ్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. గవర్నరేట్ లో వ్యాక్సినేషన్ రేటును పెంచడమే బస్ సర్వీస్ ముఖ్యోద్దేశం అన్నారు. విలాయత్ ఆఫ్ బౌషర్‌లో మూడు రోజుల పాటు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుందని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com