నిర్మాణ రంగ కార్మికుల భద్రత కోసం కొత్త చట్టాలు
- February 18, 2022
యూఏఈ: నిర్మాణ రంగ కార్మికుల భద్రత నిమిత్తం కొత్త డిక్రీని విడుదల చేశారు. 50 మంది కంటే ఎక్కువ కార్మికులున్న ఎస్టాబ్లిష్మెంట్స్ (కార్మికుల కనీస వేతనం 1,500 దిర్హాములు) వుంటే, ఖచ్చితంగా కార్మికులకు అకామడేషన్ కల్పించాలి. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎండ ప్రాంతంలో పనిచేసేందుకు నిర్మాన రంగ అలాగే ఇండస్ట్రియల్ కార్మికులను వినియోగించకూడదు. 100 మంది కంటే ఎక్కువమంది కార్మికులు పనిచేసే సంస్థలు తప్పనిసరిగా హెల్త్ మరియు సేఫ్టీ అధికారిని నియమించుకోవాలి. నిర్మాణ రంగ ప్రాంతాల్లో భద్రతని సదరు అధికారి పర్యవేక్షిస్తుండాలి. కార్మికుల భద్రతకు సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి యజమాని పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సి వుంటుంది. కార్మికులు పూర్తి భద్రత నడుమ పని చేయాలి, వారికి ఎంప్లాయర్ పూర్తి వివరాలు తెలియజేయాలి. పని ప్రాంతంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించే కార్మికులకు పెనాల్టీ విధించే అధికారాన్ని యజమానికి కట్టబెట్టింది ఈ డిక్రీ.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







