యూఏఈ-ఇండియా: షేక్ మొహమ్మద్, మోడీ వర్చువల్ మీట్..
- February 19, 2022
యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ వర్చువల్ సమ్మిట్ ద్వారా సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ సహకార విస్తరణ కోసం ఇరు పక్షాలు రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (CEPA) కుదుర్చుకున్నాయి. అబుదాబి క్రౌన్ ప్రిన్స్, UAE సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ అల్ నహ్యాన్ సమక్షంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, యుఎఇ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మోడీ, షేక్ మొహమ్మద్ "ఇండియా- UAE సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త సరిహద్దులు, కొత్త మైలురాయి" అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ఎకానమీ, ఎనర్జీ, క్లైమేట్ యాక్షన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీతో సహా విభిన్న రంగాలలో కొత్త వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలను డైనమిక్‌గా ప్రోత్సహించడం భాగస్వామ్య లక్ష్యం అని తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరంగా వృద్ధి చెందడం పట్ల ఇరువురు నేతలు తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రకటన పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత $60 బిలియన్ల నుండి $100 బిలియన్లకు పెరగడానికి CEPA తోడ్పడుతుందని ఇరువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?