హార్వర్డ్ సదస్సులో ప్రసంగించనున్న మంత్రి కేటీఆర్
- February 19, 2022
అంతర్జాతీయ ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
రేపు జరగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్’ సదస్సులో పాల్గొనాలని కోరింది. దీంతో… ఇండియా ఎట్ 2030 ట్రాన్స్‌ఫార్మేషనల్ డికేడ్, తెలంగాణ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, టర్బో ఛార్జీంగ్ అంశాలపై మంత్రి కేటీఆర్ తన అనుభవాలను పంచుకోనున్నారు. రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో కేటీఆర్… వర్చువల్‌గా ప్రసంగించబోతున్నారు.
ఈ నెల 24 నుంచి జరిగే బయో ఏషియా సదస్సులోనూ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్‌తో జరిగే ఈ యేటి బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కూడా పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సదస్సులో… లైఫ్ సైన్సెస్ గురించి గేట్స్‌తో మంత్రి కేటీఆర్ చాట్ చేయనున్నారు.
కోవిడ్19 మహమ్మారి వేళ గత రెండేళ్ల అనుభవాలు.. హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్ గేట్స్, కేటీఆర్ మధ్య చర్చ జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, మెడ్ ట్రానిక్ సీఈవో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో ప్రభావంతమైన విజినరీ నేతలు ఉంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?