ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
- February 19, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గరి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు సీనియర్ ఐపీఎస్ అధికారులు.ఈ సందర్భంగా మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. దిశ యాప్ డౌన్ లోడ్స్ 1,10,00,446 జరిగినట్లు, ఏపీ సేవా ద్వారా ఎఫ్ఐఆర్ లు 40 వేలకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారనే విషయాన్ని చెప్పారు. ఏపీ కాప్స్, ఏపీ పోలీస్ యాప్ లు అంతర్గత నిర్వహణకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల, ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారం త్వరితగతిన జరిగేలా చూసేందుకు ఓ టెక్నాలజీని రూపొందించామన్నారు. పోలీసు స్టేషన్లు అన్నీ హైస్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యాయని, పాస్‌పోర్ట్ తనిఖీలో ఏపీ మొదటి స్ధానంలో ఉందన్నారు. ఏపీ పోలీసు శాఖకు మొత్తం 150 జాతీయ అవార్డులు వచ్చినట్లు, శాఖలో పనిచేస్తున్న పోలీసులకు ప్రభుత్వం వీక్లీ ఆఫ్ ఇచ్చిందన్నారు.
ఇన్సూరెన్స్ కూడా పలు బ్యాంకుల నుంచీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో పోలీసులు ఎనలేని సేవలు చేశారని, వారి సేవలు మరువరావన్నారు. ఇక రాష్ట్రంలో గంజాయిని అణిచివేసేందుకు కఠినంగా వ్యవహరించామని, అందులో భాగంగా 7552 ఎకరాలలో గంజాయి సాగు నాశనం చేశామన్నారు. 47988 కేజీల గంజాయి ఇతర రాష్ట్రాల నుంచీ వస్తే సీజ్ చేసినట్లు, రాజేంద్రనాధ్ రెడ్డి చాలా నిబద్ధత కలిగిన అధికారి అని ప్రశంసించారు. డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి బాధ్యతలను నిర్వర్తిస్తారు.. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్లు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం.. కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త డీజీపీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కొత్త పదవిలో గౌతమ్ సవాంగ్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!