తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 20, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 107 కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,678 మంది కరోనా బారినపడగా వారిలో 7,77,434 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,109. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు చేశారు. క్రితం రోజుతో(401 కేసులు) పోలిస్తే కరోనా కొత్త కేసులు తగ్గాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల