గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి
- February 21, 2022
దుబాయ్: కోవిడ్ పరిమితులను సడలించడంతో బుర్ దుబాయ్‌లోని గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఆలయానికి భక్తుల రాక మొదలైందని ఆలయ జనరల్ మేనేజర్ గోపాల్ కూకాని చెప్పారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం.. ఆలయం ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం వరకు.. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నామన్నారు. భౌతిక దూర నిబంధనలపై సడలింపులు ఉన్నప్పటికీ, రద్దీని నివారించడానికి భక్తుల మధ్య 1.5 మీటర్ల దూర నిబంధనను కొనసాగిస్తున్నామని చెప్పారు. కోవిడ్ భద్రతా నియమాల ప్రకారం.. ఎంట్రీ/ఎగ్జిట్ గేట్ల వద్ద థర్మల్ కెమెరాలు, హ్యాండ్ శానిటైజర్లు పెట్టినట్టు తెలిపారు. జనవరి 22 నుండి దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!