'నమస్తే కువైట్' వారోత్సవాలను ప్రారంభించిన భారత రాయభారి సిబి జార్జ్

- February 21, 2022 , by Maagulf
\'నమస్తే కువైట్\' వారోత్సవాలను ప్రారంభించిన భారత రాయభారి సిబి జార్జ్

కువైట్: కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత రాయబార కార్యాలయం 'నమస్తే కువైట్' వారోత్సవాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా భారతీయ కళలు, సంగీతం, నృత్యాలను వారం రోజులపాటు ప్రదర్శించనున్నారు. కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జ్, ఆయన సతీమణి జాయిస్ సిబి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబి జార్జ్ మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న నాగరికత, అనుబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో భారతదేశం స్వదేశీంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లను ప్రపంచానికి సరఫరా చేసిందని, దీని ద్వారా వసుదైక కుటుంబం అనే భావనను చాటిందని రాయబారి గుర్తుచేశారు. కువైట్ జాతీయ దినోత్సవం, ఇండియా స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవం,  దౌత్య సంబంధాల స్థాపన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు 'నమస్తే కువైట్' వేడుకలను నిర్వహిస్తున్నారు. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా  "యా కువైతీ మర్హబా" పేరుతో మూడు భాషల్లో(అరబిక్, హిందీ,మలయాళం) ఒక వీడియో ఆల్బమ్‌ను విడుదల చేశారు. 'నమస్తే కువైట్' వేడుకలు  ఫిబ్రవరి 28 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు ఎంబసీ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని సిబి జార్జ్ తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com