హోం క్వారంటైన్‌కు గుడ్ బై చెప్పిన బ్రిటన్
- February 21, 2022
లండన్: ప్రపంచాన్ని ఇంకా కరోనా భూతం వీడడం లేదు.పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.అయితే.. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.ఈ క్రమంలో.. పలు దేశాలు ఆంక్షలు, నిబంధనలు సడలిస్తున్నాయి.బ్రిటన్ దేశంలో కరోనా మహమ్మారి ఎలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. పలు దేశాల్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండగా.. బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.కరోనా ఆంక్షలు సడలిస్తూ బ్రిటన్ ప్రభుత్వం దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది.
ఇక పై కరోనా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని, బయట తిరిగేందుకు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా..కోవిడ్ – 19 సోకితే 10 రోజులు హోం క్వారంటైన్ ఉండాలనే నిబంధనలు కూడా ఎత్తివేసింది. కోవిడ్ కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ బ్రహ్మాస్త్రం అని, వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కోవిడ్ తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.
కరోనా వైరస్ మాత్రం హఠాత్తుగా అదృశ్యం కాదని, దానితో కలిసి బతుకుతూ కాపాడుకొనే ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోస్ పూర్తయ్యిందని, 85 శాతం మంది రెండు డోస్ లు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉంటే… బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కు కోవిడ్ పాజిటివ్ సోకినట్లు, ప్రస్తుతం ఆమెకు లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయని బకింగ్ హోమ్ వెల్లడించింది. వైద్యులు నిరంతరం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. రెండు డోస్ లతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నా.. వైరస్ సోకడం గమనార్హం.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..