భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- February 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులుల 15 వేల దిగువకు వచ్చాయి. నిన్న ఒక్కరోజు భారత్‌లో 13,405 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. డైలీ పాజిటివిటీ రేటు 1.24 శాతానికి దిగొచ్చింది. రికవరీ రేటు ఏకంగా 98.38 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,81,075 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
సోమవారం ఒక్కరోజులో 34,226 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,21,58,510 (4 కోట్ల 21 లక్షల 58 వేల 510)కు చేరింది. అదే సమయంలో మరో 235 మంది కొవిడ్ తో పోరాడుతూ చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,12,344కు చేరనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా మరణాలు సంఖ్య 5,12,344 (5 లక్షల 12 వేల 344)2కు చేరినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







