కువైట్ హోటల్స్ లో నైట్ స్టేకి కువైటీలను అనుమతించరా?
- February 23, 2022
కువైట్: గల్ఫ్ దేశాలు అభివృద్ధి బాటలో పయనిస్తుంటే.. కువైట్ మాత్రం ఎక్కడా లేని వింత ఆచారాలు, సంప్రదాయాల పేరిట వెనుకబడిపోతుదంటూ కువైటీ మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైట్ సమయాల్లో విదేశీయులు స్వేచ్ఛగా కువైట్ హోటళ్లలో ఉంటుండగా.. కువైటీలు మాత్రం నైట్ సమయాల్లో మాత్రం హోటల్స్ లో స్టే చేసేందుకు వీలు లేదు.. ఇదెక్కడి చట్టం అంటూ ప్రశ్నిస్తున్నారు. విదేశీ మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్న కువైట్ లో స్థానిక మహిళలకు సంప్రదాయాల పేరిట ముందరి కాళ్లకు బంధాలు వేయడం సమంజసమా? అంటూ నిలదీస్తున్నారు. ఒక కువైట్ స్త్రీ బయటకు వెళ్లాలంటే 'మహ్రమ్' (వివాహం చేసుకోలేని బంధువు) తోడు ఉండాలి. వెనుకబడిన లేదా అభివృద్ధి చెందని దేశాలలో కనిపించే ఇలాంటి నిర్ణయాలు లేదా చట్టాలు కువైట్ లో ఇంకా అమల్లో ఉన్నాయని ఎత్తిచూపుతున్నారు. ఇలాంటి అర్థం లేని నిర్ణయాలు/చట్టాలతో కువైట్ అభివృద్ధి ఎలా సాధ్యం అవుతదంటూ కువైట్ మేధావి వర్గం ప్రశ్నిస్తోంది. మనల్ని మనం ప్రశ్నించుకునే సమయం వచ్చింది.. నిర్ణయాలు, చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలు.. ఎలా పిలిచినా ఇలాంటి వాటితో ప్రపంచంలోని పర్యాటక దేశాల మ్యాప్‌లో కువైట్‌ను నిలపగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..