భారత్ కరోనా అప్డేట్
- February 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.దేశంలో భారీగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి.దేశంలో కొత్తగా 15,102 కేసులు, 278 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,64,522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.38 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 1.28 శాతానికి చేరుకుంది.
దేశంలో ఇప్పటివరకు 4,28,67,031 కేసులు, 5,12,622 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.42 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. నిన్న కరోనా నుంచి 31,377 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 76.24 కోట్లు దాటాయని ఐసీఎంఆర్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 11,83,438 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76,24,14,018 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3298 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1422 ప్రభుత్వ లాబ్స్,1876 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







