ఆక్షలను సైతం బేఖాతరు చేస్తూ యుక్రెయిన్ పైకి దూసుకుపోతున్న పుతిన్
- February 23, 2022
యుక్రెయిన్ ఆక్రమణకు రష్యా వేగంగా అడుగులేస్తోంది. దేశం వెలుపల ఆర్మీ దళాలకు రష్యా పార్లమెంట్ అనుమతి ఇచ్చింది.
దీంతో యుక్రెయిన్‌లోకి రష్యా బలగాలు అధికారికంగా ప్రవేశించాయి. దీంతో అధికారికంగా యుద్ధం మొదలైనట్లేన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ చుట్టూ ఇప్పటికే లక్షన్నర మంది రష్యా సైన్యం మోహరించి ఉండగా.. యుక్రెయిన్ వేర్పాటవాద ప్రాంతాల్లో రష్యా ట్యాంకర్లు చక్కర్లు కొడుతున్నట్లుగా సమాచారం. రష్యా చర్యలపై ఇతర దేశాలు మండిపడుతున్నాయి. రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలను దిగుతున్నాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరోప్, జర్మనీ, జపాన్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు కూడా రష్యాపై ఆర్థిక ఆంక్షలకు దిగేందుకు సిద్ధమవుతున్నాయి.
రష్యా సైన్యం అధికారికంగా డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో ఇప్పటివరకు యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుదార్లకు పరోక్ష సాయం అందిస్తున్న రష్యా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగినట్లయింది. రష్యాను నిలువరించేందుకు అమెరికా, ఇతర యూరప్ దేశాలు నాలుగు నెలలుగా చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నాయి. అయితే, అవేవీ రష్యా దూకుడును తగ్గించలేక పోతున్నాయి.
2014లో యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను అంతర్జాతీయ సమాజం రష్యా భూభాగంగా గుర్తించాలని, యుక్రెయిన్ నాటో కూటమిలో చేరే ప్రయత్నాల నుంచి విరమించుకోవాలని రష్యా డిమాండ్లు పెట్టింది. రెండింటికీ అంగీకరిస్తే యుక్రెయిన్ జోలికి వెళ్లబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలుగా గుర్తించిన డాన్బాస్ ప్రాంతాలు రష్యా ఆర్మీ అండర్‌లోకి వెళ్లనున్నాయి.
ఒకప్పుడు సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. తన మాటను పశ్చిమ యూరప్ దేశాలు లెక్క చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైనిక ప్రాబల్యాన్ని రష్యా సరిహద్దుల వరకు విస్తరించడంతో స్వీయ భద్రతపై ఆందోళనచెందిన రష్యా.. యుక్రెయిన్‌లో అంతర్యుద్ధాన్ని ఎగదోసింది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేల మంది మరణించారు.
యుక్రెయిన్‌లో నాటో లక్షా 20 వేల మంది బలగాలను మోహరిస్తే యుక్రెయిన్ చుట్టూ రష్యా లక్షన్నర మంది బలగాలను మోహరించింది. తాజాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా తాను గుర్తించిన 2 రాష్ట్రాల్లోకి కూడా రష్యన్ బలగాలు వచ్చేశాయి. అయితే యుక్రెయిన్ సైన్యం రష్యాతో యుద్ధానికి సిద్ధంగా లేదు. అనవసరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి, పరిస్థితిని దిగజార్చవద్దని సైన్యం అధికార ప్రతినిధి నాటో దేశాలను కోరారంటే యుద్ధానికి యుక్రెయిన్ ఏ మాత్రం సన్నద్ధంగా లేదని స్పష్టమవుతోంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం