మార్చి 5 వరకు మస్కట్ బుక్ ఫెయిర్

- February 24, 2022 , by Maagulf
మార్చి 5 వరకు మస్కట్ బుక్ ఫెయిర్

ఒమన్: సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సైద్, సమాచార మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ లు మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2022 (MIBF) 26వ ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు సమక్షంలో ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. మస్కట్ బుక్ ఫెయిర్ మార్చి 5 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముగింపు వేడుకలకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  29 కళారూపాల ద్వారా గవర్నరేట్‌లోని ప్రజల జీవనాన్ని తెలిపేలా ప్రదర్శించనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌లో 27 దేశాల నుండి 715 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. 3,61,230 పుస్తకాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. దాదాపు 114 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com