కువైట్ జెండా రంగులతో వెలిగిపోతున్న ముబారకియా
- February 24, 2022
కువైట్: కువైట్ 61వ జాతీయ దినోత్సవం, ఇరాకీ దండయాత్ర నుండి 31వ విముక్తి దినం జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కువైట్ లోని వారసత్వ/చారిత్రక కట్టడాలను రంగురంగుల దీపాలతో అలకరించారు. వీధులన్నీ జాతీయ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. కువైటీల ముఖల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కువైట్లోని పురాతన వారసత్వ ప్రాంతాలలో ఒకటైన అల్-ముబారకియా మార్కెట్.. జాతీయ జెండా రంగులతో వెలిగిపోతోంది. మార్కెట్ లోని దుకాణాలు కువైట్ జెండా యొక్క రంగులతో అలంకరించారు. కువైట్ వారసత్వాన్ని తెలిపే జానపద దుస్తులతో హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. కువైట్ చరిత్రను తెలియజేసేలా అక్కడి గోడలపై వేసిన పెయింటింగ్ లు ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







