పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- September 29, 2025
దోహా: MIE-SPPU ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఖతార్లోని దాని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd) ప్రోగ్రామ్ తొలి బ్యాచ్ కోసం క్లాసులను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ప్రారంభ సెషన్లో MIE-SPPU ఖతార్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి బి నాథ్ మరియు ఆపరేషన్స్ హెడ్ దినేష్ బక్షి పాల్గొన్నారు. ఈ BEd ప్రోగ్రామ్ హైబ్రిడ్ మోడల్ను అందిస్తుందని, ఆన్లైన్ మరియు ఈవెనింగ్ క్లాసులు ఉంటాయని వెల్లడించారు. భారత జాతీయ విద్యా విధానం (NEP 2020) కు అనుగుణంగా ఉన్న పాఠ్యాంశాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యావేత్తలకు అందించడం పట్ల తాము గర్విస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







