భారత్ కరోనా అప్డేట్
- February 24, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.దీంతో ప్రజలు ఉపశమనం చెందుతున్నారు. నెమ్మదిగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. శ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,148 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు.దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది.కరోనా మృతుల సంఖ్య 5,12,924గా నమోదైంది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 1.22 శాతానికి పరిమితమైంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. బధవారం మరో 30,49,988 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,52,31,385కు చేరినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







