BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం

- February 24, 2022 , by Maagulf
BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం

అబుధాబి: భారత పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం అబుధాబిలోని నిర్మాణంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. UAE, ఇండియా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉన్నాయన్నారు. ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తో రెండు దేశాల మధ్య బంధం బలపడిందన్నారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, భారత ప్రధాన మంత్రి మోడీలు ఫిబ్రవరి 2018లో ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం.. యూఏఈ-ఇండియా స్నేహానికి చిహ్నంగా మారిందన్నారు. భారత ప్రతినిధి బృందంలో 17 మందిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.ఈ సందర్భంగా ఓం బిర్లాతో UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయేషా కూడా ఉన్నారు.అంతకుముందు ప్రతినిధి బృందానికి పూజ్య బ్రహ్మవిహారి స్వామి  సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.దేవాలయం నిర్మాణం గురించి వారికి వివరించారు. ఒక ఇటుకను స్పాన్సర్ చేయడం ద్వారా ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉందని, మరిన్ని వివరాలను క్రింది లింక్‌లో చూడవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

https://www.mandir.ae/bricks/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com