దుబాయ్‌ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు 35 దిర్హామ్‌లు చెల్లించాలి

- March 31, 2016 , by Maagulf
దుబాయ్‌ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు 35 దిర్హామ్‌లు చెల్లించాలి




దుబాయ్‌ పోర్ట్‌ని వినియోగించుకునే ప్రయాణీకులు ఇకపై 35 దిర్హామ్‌లు చెల్లించవలసి ఉంటుంది. దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ దుబాయ్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఈ మేరకు రిజల్యూషన్‌ పాస్‌ చేశారు. ఎయిర్‌పోర్ట్‌ల్లో ప్రయాణీకులు సౌకర్యాలను వినియోగించుకున్నందుకుగాను వినియోగరుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ నుంచి ప్రయాణించే ఏ ప్రయాణీకుడైనాసరే, ట్రాన్సిట్‌ ప్యాసింజర్స్‌తో కలిసి సర్వీసు ఛార్జీగా 35 దిర్హామ్‌లుగా చెల్లించాలి. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు టిక్కెట్లు ఇచ్చే సమయంలోనే ఈ రుసుమును వసూలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌కీ, తద్వారా దుబాయ్‌ ప్రభుత్వ ట్రెజరీకీ ఈ మొత్తం చేరుకుంటుంది. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంకా అభివద్ధి చేయడానికి ఈ నిధుల్ని వినియోగిస్తారు. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైనప్పటినుంచీ ఈ ఫీజు అమల్లోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com