దుబాయ్ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు 35 దిర్హామ్‌లు చెల్లించాలి
- March 31, 2016
దుబాయ్ పోర్ట్‌ని వినియోగించుకునే ప్రయాణీకులు ఇకపై 35 దిర్హామ్‌లు చెల్లించవలసి ఉంటుంది. దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరకు రిజల్యూషన్ పాస్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌ల్లో ప్రయాణీకులు సౌకర్యాలను వినియోగించుకున్నందుకుగాను వినియోగరుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ నుంచి ప్రయాణించే ఏ ప్రయాణీకుడైనాసరే, ట్రాన్సిట్ ప్యాసింజర్స్‌తో కలిసి సర్వీసు ఛార్జీగా 35 దిర్హామ్‌లుగా చెల్లించాలి. ఎయిర్‌లైన్స్ సంస్థలు టిక్కెట్లు ఇచ్చే సమయంలోనే ఈ రుసుమును వసూలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్స్కీ, తద్వారా దుబాయ్ ప్రభుత్వ ట్రెజరీకీ ఈ మొత్తం చేరుకుంటుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా అభివద్ధి చేయడానికి ఈ నిధుల్ని వినియోగిస్తారు. అధికారిక గెజిట్‌లో ప్రచురితమైనప్పటినుంచీ ఈ ఫీజు అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







