తెలంగాణ కరోనా అప్డేట్
- February 24, 2022
హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35వేల 837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెలుగుచూశాయి.
అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,79,893 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజుతో(348) పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







