భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- February 25, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు.దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,94,345కి చేరింది.కరోనా మృతుల సంఖ్య 5,13, 226గా నమోదైంది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,988 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,22,46,884కి చేరింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 1.28 శాతానికి పరిమితమైంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 32,04,426 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,86,89,226కు చేరినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







