ఏపీ పోలీస్ ఖాతాలో.. మరో 15 అవార్డులు
- February 25, 2022
అమరావతి: జాతీయ స్థాయిలో టెక్నాలజీ, వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ దక్కించుకుంది. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను ఏపీ పోలీస్ శాఖ గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచిందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయం తోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించారు.జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అభినందించారు. అయితే పోలీస్ ప్రధాన కార్యాలయం (8), అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1) చొప్పున అవార్డులను తమ ఖాతాలో వేసుకున్నాయి.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!