యూఏఈలో ఇకపై మాస్కులు తప్పనిసరి కాదు
- February 26, 2022
యూఏఈ: బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి కాదని నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NCEMA) ప్రకటించింది. ఆర్థిక, పర్యాటక ప్రదేశాలలో సామాజిక దూర నిబంధనలను కూడా రద్దు చేశారు. అయితే, క్లోజ్డ్ ఏరియాలో ఫేస్ మాస్కులు తప్పనిసరి. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 26 నుండి అమలులోకి వస్తాయని NCEMA తెలిపింది. కోవిడ్-19 రోగుల సన్నిహిత కాంటాక్ట్ లు కూడా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా వారు ఐదు రోజుల వ్యవధిలో రెండు PCR పరీక్షలు చేయించుకోవాలని NCEMA పేర్కొంది. వ్యాధి సోకిన వ్యక్తుల కోసం ఐసోలేషన్ ప్రోటోకాల్‌లు గతంలో ప్రకటించిన విధంగానే కొనసాగుతాయి. చాలా ఎమిరేట్స్ లో, కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన వ్యక్తులు సాధారణంగా కనీసం పది రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్