బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో స‌రికొత్త గేమ్ ను రూపొందించిన హైద‌రాబాద్‌ సంస్థ

- February 26, 2022 , by Maagulf
బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో స‌రికొత్త గేమ్ ను రూపొందించిన హైద‌రాబాద్‌ సంస్థ

ప్ర‌స్తుతం అత్యంత ఆద‌ర‌ణ పొందిన టెక్నాల‌జీల్లో బ్లాక్ చెయిన్‌, మెటావ‌ర్స్ టెక్నాల‌జీలు ప‌టిష్ట‌మైన‌వి. ఈ రెండు టెక్నాల‌జీల‌ను అనుసంధానం చేస్తు హైద‌రాబాద్‌కు చెందిన గేమింగ్ ఇండ‌స్ట్రీ ఓ గేమ్‌ను క్రియోట్ చేసింది. ఈ గేమ్ లో హైలెవ‌ల్ కు వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్ల‌ను గెలుచుకోవ‌చ్చ‌ని, ఈ టోకెన్ల‌ను క్రిప్టో ఎక్చేంజ్ ద్వారా సొమ్ము చేసుకోవ‌చ్చని గేమ్ త‌యారీదారులు చెబుతున్నారు. హైద‌రాబాద్ స్టార్టప్ సంస్థ క్లింగ్ ట్రేడింగ్ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ మార్చిలో అందుబాటులోకి రానున్న‌ట్టు గేమింగ్ నిర్వ‌హాకులు తెలిపారు.

2022 జూన్ నుంచి ఈ గేమింగ్ ఫుల్ వెర్ష‌న్ సామ‌న్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వస్తుంద‌ని క్లింగ్ ట్రేడింగ్ సంస్థ తెలియ‌జేసింది. ఆ గేమింగ్‌లో ఒక్కో లెవ‌ల్ దాటుకుంటూ పోయే కొల‌ది క్రిప్టో టోకెన్లు గెలుకుంటారు. అయితే, ఈ క్రిప్టో టోకెన్ల‌ను న‌గ‌దుగా మార్చుకునేందుకు వీలుగా పాన్‌కేక్ స్వాపింగ్ డీ సెంట్ర‌లైజ్డ్ ఎక్చేంజీతో ఒప్పందం చేసుకున్న‌ట్టు నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు. ఒకేసారి అనేక మంది ఈ గేమ్‌ను ఆడేందుకు వీలుగా మెటావ‌ర్స్ టెక్నాల‌జీని పొందుప‌రిచారు. దీంతో వ‌ర్చువ‌ల్‌గా ఒకేసారి అనేక‌మంది ఈ గేమ్‌ను ఆడేందుకు వీలు ఉంటుంద‌ని క్లింగ్ ట్రేడింగ్ సంస్థ స్ప‌ష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com