వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు పీసీఆర్ టెస్ట్ లేదు: ఎయిర్ ఇండియా

- February 27, 2022 , by Maagulf
వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు పీసీఆర్ టెస్ట్ లేదు: ఎయిర్ ఇండియా

యూఏఈ: ఇండియా నుంచి యూఏఈకి వచ్చే వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు ప్రీ-ట్రావెల్ కోవిడ్-19 PCR టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఈ మేరకు యుఎఇ ప్రభుత్వం ట్రావెల్ నిబంధనలను సడలించినట్లు పేర్కొంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రయాణీకులు తప్పనిసరిగా WHO లేదా UAE ఆమోదించిన వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయినట్లు తెలిపే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అదే వ్యాక్సిన్ వేయించుకోని ప్రయాణికులు మాత్రం ప్రయాణానికి  48 గంటలముందు చేయించుకున్న నెగటివ్ కోవిడ్-19 సర్టిఫికేట్ ను సమర్పించాలి. లేదా కరోనా వచ్చి కోలుకున్నట్లు(నెల వ్యవధి) సంబంధిత అధికారులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ను అయినా సమర్పించవచ్చు. UAEకి వచ్చిన తర్వాత ప్రయాణీకులందరూ PCR టెస్ట్ చేయించుకోవలసి ఉంటుంది. రిజల్ట్ వచ్చే వరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రెండింట్లోనూ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com