భారత్ కరోనా అప్డేట్
- February 27, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ తగ్గుముఖం పట్టింది.క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 243 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.
ఇక, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 20,439 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.0 శాతానికి పడిపోయింది.. యాక్టివ్‌కేసుల సంఖ్య 1,11,472గా ఉంది.ఇప్పటి వరకు మృతి చెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 5,13,724కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 4,22,90,921కు పెరిగింది.మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. శనివారం ఒకేరోజు 24,05,049 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు పంపిణీ చేసిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 177,44,08,129కు చేరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







