తొలి ఒమన్ ఎలక్ట్రిక్ కారు మేస్ i E1 కు రికార్డు బుకింగ్‌లు

- February 27, 2022 , by Maagulf
తొలి ఒమన్ ఎలక్ట్రిక్ కారు మేస్ i E1 కు రికార్డు బుకింగ్‌లు

ఒమన్ –మస్కట్:  ఒమన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మేస్ i E1 కోసం 500 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయని మేస్ మోటార్స్ సహ వ్యవస్థాపకుడు హైదర్ బిన్ అద్నాన్ అల్ జాబీ చెప్పారు. ఫిబ్రవరి 20న మేస్ మోటార్స్.. మొదటి ఒమానీ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్ జాబీ మాట్లాడుతూ.. మేస్ మోటార్స్ ఒమన్ టెక్నాలజీ ఫండ్ ద్వారా నిధులు సమకూరుస్తుందన్నారు. విడుదలకు ముందే 100 వాహనాల బుకింగ్‌లు జరిగాయన్నారు. కేవలం రెండు రోజుల్లో సుమారు 400 కార్లకు బుకింగ్ లు వచ్చాయన్నారు. 2023 చివరిలో ఉత్పత్తిని ప్రారంభించి.. అనంతరం డెలివరీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. తర్వాత విడతల వారీగా తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. కంపెనీ ఉత్పత్తిని పెంచేందుకు కొత్త నియామకాలను చేస్తామన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. ఒమన్‌లోని పెట్రోల్ బంకుల్లో రీఛార్జ్ పాయింట్‌లను ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రైవేట్ కంపెనీలు, షెల్‌తో కలిసి పని చేస్తున్నట్లు అల్ జాబీ చెప్పారు. Mays i E1 కార్బన్ ఫైబర్ బాడీని కలిగి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కిమీల వరకు నడుస్తుంది. నాలుగు సెకన్ల కంటే తక్కువ సమయంలో 100కిమీ/గం వరకు వేగాన్ని అందుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com