యుక్రెయిన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న తెలుగు విద్యార్థులు..

- February 27, 2022 , by Maagulf
యుక్రెయిన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న తెలుగు విద్యార్థులు..

హైదరాబాద్: యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా తిరిగివచ్చారు. 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డితోపాటు డీసీపీ స్వాగతం పలికారు. వీరంతా నిన్న రాత్రి యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకోగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. 20 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలిస్తోంది. విద్యార్థులు, పౌరులను ఎయిరిండియా విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటివరకు 469 మంది భారతీయులు భారత్ కు చేరుకున్నారు. కాసేపట్లో మరో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకోనుంది. 240 మందితో బుడాపెస్ట్ నుంచి విమానం బయల్దేరింది.

నిన్న రాత్రి 219 మంది విద్యార్థులతో తొలి విమానం ముంబైకి చేరుకుంది. తెల్లవారుజామున 250 మందితో రెండో విమానం ఢిల్లీకి చేరుకుంది. 28 మంది తెలుగు విద్యార్థులు (తెలంగాణ-17, ఏపీ-11) ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం వారిని విమానంలో హైదరాబాద్ కు పంపించారు. 28 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com