ముందస్తు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు: ఎతిహాద్
- February 27, 2022
అబుధాబి: ఫిబ్రవరి 26 నుండి అమల్లోకి వచ్చిన యూఏఈ కొత్త ట్రావెల్ నిబంధనల ప్రకారం.. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారికి, ఎతిహాద్ ఎయిర్వేస్లో అబుధాబికి ప్రయాణించే గెస్ట్ లకు ఇకపై ముందస్తు PCR టెస్ట్ అవసరం లేదు.ఈ మేరకు ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థ వెల్లడించింది.అలాగే వ్యాక్సినేటెడ్ అయి అబుధాబి ద్వారా బయలుదేరే వారికి కూడా PCR పరీక్షలు అవసరం లేదు.అయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా QR కోడ్‌ని కలిగి ఉండాలి. ప్రయాణికులు అబుధాబి ఎయిర్ పోర్టుకి చేరుకున్న తర్వాత మాత్రం ఉచిత కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.వ్యాక్సిన్ వేయించుకోని వారు, అబుదాబికి లేదా అక్కడి నుండి ప్రయాణించే గెస్టులు మాత్రం తప్పనిసరిగా బయలుదేరిన 48 గంటలలోపు తీసుకున్న నెగిటివ్ PCR టెస్ట్ రిపోర్టు సమర్పించాలి లేదా కోవిడ్-19 వచ్చిన 30 రోజులలోపు QR కోడ్‌తో రికవరీ సర్టిఫికేట్ ను అందజేయాలి.16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విమానంలో ప్రయాణించడానికి వ్యాక్సిన్, పీసీఆర్ టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..