ఉక్రెయిన్‌కు నేరుగా జర్మనీ ఆయుధాలు

- February 27, 2022 , by Maagulf
ఉక్రెయిన్‌కు నేరుగా జర్మనీ ఆయుధాలు

జర్మనీ: ఉక్రెయిన్‌కు ఆయుధాలు సహా ఇతర వస్తువులను నేరుగా పంపుతామని జర్మనీ ప్రకటించింది. రష్యా కోసం ‘స్విఫ్ట్’ గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ కొన్ని పరిమితులకు జర్మనీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడానికి తమ దేశం సిద్ధమవుతోందని జర్మనీ అధికారులు తెలిపారు. ఆ దేశ రవాణా మంత్రి వోల్కర్ విస్సింగ్ అటువంటి చర్యను సమర్ధించారు . దీనికి అన్ని సన్నాహాలు చేయాలని ఆదేశించారు. ఉక్రెయిన్‌కు 1,000 ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలను, 500 ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను త్వరగా పంపనున్నట్లు జర్మనీ ఛాన్సలర్ కార్యాలయం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com