యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది తెలంగాణ విద్యార్థులు
- February 28, 2022
న్యూఢిల్లీ: యుద్ధభూమి యుక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ‘ఆపరేషన్ గంగ’ వేగంగా సాగుతోంది. రొమేనియా, హంగేరి దేశాల మీదుగా యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని భారత విద్యార్థులను ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో భారత ప్రభుత్వం తరలిస్తుండగా, వచ్చినవారిలో తెలుగువారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించే పనిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్లు చురుగ్గా పనిచేస్తున్నాయి.రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి మొత్తం 3 విమానాలు భారత్ చేరుకోగా,అందులో రెండు ఢిల్లీకి, ఒకటి ముంబైకి చేరుకుంది. అలాగే హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీ చేరుకుంది.
శనివారం రాత్రి ముంబై చేరుకున్న విమానంలో 14 మంది, ఆదివారం ఢిల్లీ చేరుకున్న 3 విమానాల్లో కలిపి మొత్తం 25 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులను అధికారులు గుర్తించారు. వారందరినీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు తరలించి వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణ భవన్ అధికారులు, అనంతరం వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌కు టికెట్లు బుక్ చేసి పంపిస్తున్నారు. అక్కణ్ణుంచి విద్యార్థులను వారి ఇళ్ల వరకు చేర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలుగు విద్యార్థులను గుర్తించే క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నారు.
‘ఆపరేషన్ గంగ’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతీయుల తరలింపు కార్యక్రమంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం తో అనునిత్యం సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ చేరుకునే విమానాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులను గుర్తించి, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇందులో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కూడా 24 గంటలూ పనిచేస్తోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







