బెలార‌స్‌లో యుక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య చ‌ర్చ‌లు ప్రారంభం

- February 28, 2022 , by Maagulf
బెలార‌స్‌లో యుక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య చ‌ర్చ‌లు ప్రారంభం

బెలార‌స్‌: ప్ర‌త్య‌క్ష యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా,యుక్రెయిన్ ల మ‌ధ్య కాసేప‌టి క్రితం చ‌ర్చ‌లు మొదల‌య్యాయి. బెలార‌స్ కేంద్రంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో ఎలాంటి నిర్ణ‌యం వెలువడుతుందన్న విష‌యంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.బెలార‌స్‌లో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన‌ట్గుగా అంత‌కుముందు బెలార‌స్ విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది.

ర‌ష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తున్న బెలార‌స్‌లో చ‌ర్చ‌ల‌కు తాము వ్య‌తిరేక‌మంటూ రెండు రోజుల క్రితం యుక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.చ‌ర్చ‌ల‌కు తొలుత ర‌ష్యానే ప్ర‌తిపాద‌న చేయ‌గా.. అందుకు అంగీక‌రించిన జెలెన్‌స్కీ చ‌ర్చ‌ల‌ను బెలార‌స్‌లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌పై జ‌రిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు.అయితే ర‌ష్యా భీక‌ర దాడుల‌తో యుక్రెయిన్ లో ప‌రిస్థితి నానాటికీ విష‌మిస్తున్న నేప‌థ్యంలో బెలార‌స్‌లోనే చ‌ర్చ‌ల‌కు జెలెన్‌స్కీ అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.కాసేప‌టి క్రితం బెలార‌స్‌లోనే మొదలైన చ‌ర్చ‌ల్లో ర‌ష్యా, యుక్రెయిన్ దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com