ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్
- March 01, 2022
ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్‌కు ఏళ్లు పడుతుందేమో అని అందరూ అభిప్రాయపడ్డారు.
అయితే ఆశ్చర్యకరంగా దర్శకుడు 103 రోజుల్లోనే ఆది పురుష్ షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పలు టెక్నికల్ వర్క్స్‌తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు శివ రాత్రి సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
#Adipurush
— Om Raut (@omraut) March 1, 2022
Worldwide Theatrical Release in 3D on 12th Jan 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 #ShivChanana #TSeries pic.twitter.com/ozGRZPRiQR
తాజా వార్తలు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే









