'రాధేశ్యామ్' నుండి కొత్త ట్రైలర్
- March 02, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో వీడియోను విడుదల చేసింది టీమ్. ఈ సరికొత్త ట్రైలర్లో.. మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడతాం.. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి అంటూ ప్రభాస్ వాయిస్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అంటూ పూజా హెగ్డే పలికే డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్స్‌ను చూస్తుంటే... సినిమా విజువల్ వండర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నారు. పిరియాడికల్ లవ్‌స్టోరిగా వస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు ఇక్కడి సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా హిందీకి మాత్రం సచిత్ బల్హరా, అంకిత్ బల్హరా, మితున్, అమల్ మాలీక్, మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.
ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఇప్పటికే భారీగా జరిపింది టీమ్. ఈ ఈవెంట్‌ను డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను గత నవంబర్ 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్ నగుమోము తారలే కూడా చిత్రబృందం విడుదల చేసింది చిత్రబృందం. ఇక మూడో సాంగ్ "సంచారి పాటను కూడా రిలీజ్ చేసింది. ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







