రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్
- March 02, 2022
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే తీర జలాల్లో వ్యూహత్మక ప్రాంతాలకు రష్యా సబ్ మెరైన్లు చేరుకున్నట్టు తెలుస్తోంది. రష్యా చేపట్టే న్యూక్లియర్ డ్రిల్స్‌లో పలు న్యూక్లియర్ సబ్ మెరైన్లు పాల్గొంటున్నాయి. సైబిరియా మంచు అడవుల్లో మొబైల్ లాంచర్లను రష్యన్ ఆర్మీ మోహరించింది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను కూడా మోహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని రష్యా నార్తన్ ఫ్లీట్ అధికారికంగా ప్రకటించింది.
పుతిన్ వ్యూహం ఏంటో? :
యుక్రెయిన్‌లో రష్యా యుద్ధం నేపథ్యంలో దేశంలోని అణ్వాయుధ బలగాలను పుతిన్ అప్రమత్తం చేసినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో ఆయుధాలను న్యూక్లియర్ సబ్ మెరైన్లతో వ్యూహాత్మక బాంబర్లను రష్యా సిద్ధం చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా ప్రపంచంలోనే రెండు అతిపెద్ద అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి.
పుతిన్ ఆదేశాల వెనుక ఎలాంటి వ్యూహం ఉందనేది అస్పష్టంగా ఉంది. అమెరికాతో పోల్చితే.. రష్యా అణు ప్రయోగాలకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపై ఎక్కువగా ఆధారపడుతోంది. వీటి కోసం మొబైల్ లాంచర్లను వినియోగిస్తుంటుంది. అలాంటిది పుతిన్ వ్యూహం అణు ప్రయోగమేనా కాదా అనేది అంచనా వేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పుతిన్ ఆదేశాలతో మరింత ఉద్రికత్తలను పెంచుతోంది.
మరోవైపు.. యుక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీవ్ నగరానికి సరిహద్దులో చొరబడిన రష్యా బలగాలు అక్కడి నుంచే దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్ నగర జనావాసాలపై వైమానిక దాడులతో తెగబడుతున్నాయి. యుక్రెయిన్ సైన్యం కూడా దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా వైమానిక దాడులతో కీవ్ నగరంలో విధ్వంసం సృష్టిస్తోంది. తాజాగా రష్యా జరిపిన వైమానిక దాడుల్లో కీవ్ నగరంలోని ప్రధాన టీవీ టవర్ ధ్వంసమైంది. ఈ దాడిలో అక్కడే ఉన్న ఐదుగురు మృతిచెందినట్టు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







