అమరావతి: హైకోర్టు తీర్పుతో..సీఎం జగన్ సమీక్షా..
- March 03, 2022
అమరావతి: ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది.అంతే కాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు.
హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు.ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొందరు రాజకీయ ప్రముఖులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మరికొందరు సీఎం జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మానుకోవాలని.. హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని అన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







