ఇతర మంత్రులకు మేకపాటి గౌతమ్ రెడ్డి శాఖలు కేటాయింపు
- March 03, 2022
అమరావతి: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై 50 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు.మరో వైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి శాఖలను ఇతర మంత్రులకు సీఎం జగన్ కేటాయించారు. ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలను సీదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ శాఖను ఆదిమూలపు సురేశ్ కు, జీఏడీ శాఖను కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ శాఖను బుగ్గన రాజేంద్రనాథ్ కు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ శాఖల వ్యవహారాలను ఆయా మంత్రులు చూడనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







