బిగ్ టికెట్ డ్రా లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు

- March 04, 2022 , by Maagulf
బిగ్ టికెట్ డ్రా లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు

అబుధాబి: భారత దేశానికి చెందిన వ్యక్తికి గురవారం అబుధాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ డ్రాలో జాక్‌పాట్ తగిలింది.మహ్మద్ సమీర్ అలన్ అనే భారతీయుడు ఏకంగా 12 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 27న సమీర్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.192202కు ఈ జాక్‌పాట్ తగిలింది. దుబాయ్‌లో ఏసీ టెక్నిషియన్‌గా పనిచేసే సమీర్ నెలకు 3,300 దిర్హమ్స్ సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 27న మరో ఆరుగురితో కలిసి వెయ్యి దిర్హమ్స్‌తో బిగ్ టికెట్ కొనుగోలు చేశాడు.ఇందులో 500 దిర్హమ్స్ సమీర్ చెల్లించాడు. దీంతో వారు గెలిచిన 12 మిలియన్ దిర్హమ్స్‌లో 6 మిలియన్ దిర్హమ్స్ తనకు వస్తాయని పేర్కొన్నాడు. 

ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల సమీర్ ఆనందం వ్యక్తం చేశాడు. భారత్‌లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమీర్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వెంటనే తన భార్యను దుబాయ్‌కి పిలిచి నగరమంతా తిప్పి చూపించడంతో పాటు ఆమె కొరుకున్నవన్నీ కొనిపెడతానని చెప్పుకొచ్చాడు.అలాగే స్వదేశంలో వ్యవసాయంలో కొంత మొత్తం పెట్టుబడిగా పెడతానన్నాడు. దీంతోపాటు తన తల్లిదండ్రులకు కొంత భాగాన్ని ఇవ్వనున్నట్లు తెలిపాడు. కాగా, ఇదే డ్రాలో మరో భారత వ్యక్తి అజిత్ వరియత్ రెండో బహుమతి అయిన 1మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు.ఇటీవల అజిత్ కొన్న లాటరీ టికెట్ నం. 273166 అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.ఇదిలా ఉండగా, ఈ నెల వీక్లీ డ్రా 300,000 దిర్హమ్స్ ప్రైజ్ మనీతో కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com