స్మాట్రాన్ తన తొలి స్మార్ట్ఫోన్ 'టి.ఫోన్' మార్కెట్లో ఆవిష్కరించింది..
- March 31, 2016
దేశీ టెక్నాలజీ కంపెనీ స్మాట్రాన్ తన తొలి స్మార్ట్ఫోన్ 'టి.ఫోన్', అల్ట్రాబుక్ 'టి.బుక్'లను గురువారం మార్కెట్లో ఆవిష్కరించింది. 'టి.ఫోన్' స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల తెరతో చాలా తేలికగా ఉంటుందని స్మాట్రాన్ పేర్కొంది. ఫోన్కు సంబంధించిన ఏ ఇతర ప్రత్యేకతలను కంపెనీ వెల్లడించలేదు. ఇవి ఏప్రిల్ చివరి వారంలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇక 'టి.బుక్'లో 12.2 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 37 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని స్మాట్రాన్ తెలిపింది. దీని ధర రూ.39,999. ఇవి వినియోగదారులకు ఏప్రిల్ 8 నుంచి 'గ్యాడ్జెట్స్360.కామ్'లో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







