ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
- March 04, 2022
థాయ్‌లాండ్: ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు.52 ఏళ్ల షేన్ వార్న్ థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించాడు.ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా షేన్ వార్న్ పేరుగాంచాడు. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రపంచ అత్యుత్తమ లెగ్‌స్పిన్నర్‌గా షేన్ వార్న్‌కు గుర్తింపు ఉంది. ఎన్నో మ్యాచుల్లో ఆస్ట్రేలియాను వార్న్ ఒంటిచేత్తో గెలిపించాడు. స్టైలిష్ బౌలింగ్ యాక్షన్‌తో మ్యాజిక్ బౌలింగ్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మెన్స్ ను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఆస్ట్రేలియా తరుఫున 145 టెస్టులు మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్… 708 వికెట్లు తీశాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 2007 జనవరి 7న టెస్ట్ క్రికెట్‌కు షేన్ వార్న్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2005 జనవరి 10న చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు షేన్ వార్న్ ప్రాతినిధ్యం వహించాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు.
ఐపీఎల్ సీజన్ వన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన షేన్ వార్న్… ఏకంగా తొలి విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచాడు. షేన్ వార్న్ బౌలింగ్ చేస్తున్నాడంటే బయపడిన బ్యాట్స్‌మెన్స్ ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలోని ఎంతో మంది బ్యాట్స్‌మెన్స్ పలు ఇంటర్య్వూల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







