ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో మాట్లాడిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- March 05, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై షేక్ మొహమ్మద్‌కు జెలెన్స్ కీ వివరించాడు. ఈ సందర్భంగా చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారాలు లభిస్తాయని జెలెన్ స్కీకి షేక్ మొహమ్మద్ వివరించారు. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రతి చర్యకు UAE మద్దతు ఇస్తుందన్నారు. ఉక్రెయిన్‌లోని బాధిత పౌరులకు మానవతా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ మొహమ్మద్ స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని షేక్ మొహమ్మద్ సూచించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







