రియాద్ మారథాన్ 2022 కోసం ఏర్పాట్లు పూర్తి

- March 05, 2022 , by Maagulf
రియాద్ మారథాన్ 2022 కోసం ఏర్పాట్లు పూర్తి

రియాద్: రియాద్ మారథాన్ 2022 కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సౌదీ అరేబియా అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఔత్సాహికులు ఈ మారథాన్‌లో పాల్గొననున్నారు. శనివారం జరిగే మారథాన్‌లో విజేతలు 2 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు గెలుచుకునే అవకాశం వుంది. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్ నుంచి సంపూర్ణ మద్దతుతో సౌదీ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. కింగ్ సౌద్ యూనివర్సిటీ వద్ద ఉదయం 6.15 నిమిషాలకు ప్రారంభమయ్యే మారథాన్ 45 కిలోమీటర్ల మేర జరుగుతుంది. 18 ఏళ్ళు పైబడినవారికి 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రేసు (17 ఏళ్ళ ఆ పైన వయసు వారికి), 4 కిలోమీటర్ల రేస్ చిన్న పిల్లల కోసం కూడా ఇందులో పొందుపరిచారు. మారథాన్ విలేజ్ ఈవెంట్లను శుక్ర మరియు శనివారాల్లో నిర్వహిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com