వెలుగుల బహ్రెయిన్.. రాత్రి వేళ సరికొత్త కాంతులు.!

- March 05, 2022 , by Maagulf
వెలుగుల బహ్రెయిన్.. రాత్రి వేళ సరికొత్త కాంతులు.!

బహ్రెయిన్: చీకటి అంటే ఒకప్పుడున్న భయం ఇప్పుడు లేవు. ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు, పగలూ రాత్రీ ఒకేలా దర్శనమిస్తున్నాయి. ఆ మాటకొస్తే, పగటి కంటే రాత్రి వేళ ఆయా నగరాలు మరింత సుందరంగా మారిపోతున్నాయి. ఇందుకోసం లైటింగ్ ఫెస్టివల్స్.. చేస్తున్నారు. అదే తరహా ప్రయోగం బహ్రెయిన్‌లోనూ చేయనున్నారు. ఈ మేరకు బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ, ఓ థీమ్ కోసం టెండర్లను పిలుస్తోంది. రీజియన్‌లో తొలిసారిగా లైటింగ్ ఫెస్టివల్ బహ్రెయిన్‌లో కనువిందు చేయనుంది. రమదాన్ థీమ్ ద్వారా అత్యద్భుతమైన కాంతులు విరజిమ్మేలా ఐస్‌లాండ్‌కి చెందిన ఓ కంపెనీ ఈ ఫెస్టివల్‌ని డిజైన్ చేసే అవకావం వుంది. ఈ నెల 20 లోపు ఔత్సాహికులు బిడ్స్ దాఖలు చేయవచ్చు. 500 బహ్రెయినీ దినర్ల బాండ్ మరియు 15 బహ్రెయినీ దినార్ల ఫీజు చెల్లించాల్సి వుంటుంది టెండర్ల కోసం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com